

‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘చంద్రయాన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు తొలుత ముహూర్తం ఖరారైంది. అయితే, తాజాగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రయాణానికి ముందు ఊహించని మలుపు ఎదురైందని, ట్రైలర్ లాంచ్ ప్రణాళికల్లో అనుకోని మార్పులు చోటుచేసుకున్నాయని మేకర్స్ వెల్లడించారు. కొత్త కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొంటూ, మరిన్ని వివరాల కోసం వేచి ఉండాలని అభిమానులను కోరారు. అయితే, ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన కొత్త తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాస్యభరిత అడ్వెంచర్ కథాంశంతో రూపొందిన ‘చంద్రయాన్’ను అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ వాయిదా పడటంతో సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లోనూ రిలీజ్ డేట్ లేకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే, సినిమా విడుదల తేదీ మారిందా లేదా అనే విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!