

మలయాళంలో ఘనవిజయం సాధించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘ప్రేమలు’ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌పై అనిశ్చితి నెలకొంది. రెండో భాగం వస్తుందనే ప్రకటనతో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపించినప్పటికీ, ప్రాజెక్ట్ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాలం గడుస్తున్నా చిత్రబృందం నుంచి స్పష్టమైన అప్‌డేట్ రాకపోవడంతో సీక్వెల్ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కథానాయకుడు నెస్లన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. రెండో భాగం కోసం సరైన కథను సిద్ధం చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని సమాచారం. తొలి భాగం సాధించిన విజయాన్ని మించే కథతో రావాలనే ఉద్దేశంతో చిత్రబృందం ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రేక్షకుల అంచనాలకు తగ్గ కథ ఇంకా ఖరారు కాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!