

టాలీవుడ్లో కొన్ని భామల కెరీర్లు మెరుపువేగంతో వెలుగుతాయి-- అదే వేగంతో మాయమవుతాయి కూడా. అందంలో, గ్లామర్‌లో, ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఏమాత్రం తగ్గని ఓ అందాల తార కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొందీ. మొదటి సినిమాతోనే యూత్‌ని ఊపేసింది. రెండో సినిమాలో కూడా సాలిడ్ హిట్ కొట్టింది. స్టార్ రేంజ్‌కి వెళ్లే అవకాశం ఉన్న టైంలోనే-- ఊహించని విధంగా ఆమె కెరీర్ బ్రేక్ అయ్యింది. అందం, నీలికళ్ల మాయ, ఐశ్వర్య రాయ్‌ను గుర్తు చేసే లుక్స్--అన్నీ ఉన్నా ఆఫర్లు మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి.
పెద్ద హీరోలతో చేసిన సినిమాలే బ్లాక్బస్టర్లు అయినా-- తర్వాత వచ్చిన ఫ్లాప్‌లు ఆమె కెరీర్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. వరుడు, అలా మొదలైందిలో చిన్న రోల్స్-- తర్వాత అల్లరి నరేష్‌తో మడత కాజాలో చేసిన ప్రయత్నం-- యాక్షన్ 3D, అంతా నీ మాయలోనే --ఏ సినిమాతోనూ మళ్లీ పిక్అప్ కాలేదు. కన్నడ, హిందీ సినిమాల్లో కూడా అదృష్టం పరీక్షించుకుంది-- కానీ స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. చివరిసారి 2022లో హిందీ మూవీ Love You Loktantraలో కనిపించిన తర్వాత స్నేహా ఉల్లాల్ దాదాపు ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసినట్టే. రెండు హిట్స్‌తో భారీ స్టార్టింగ్-- తర్వాత అవకాశాలు రాక కెరీర్ ఇలా నెమ్మదిగా మాయం కావడం నిజంగా షాకింగ్.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!