
డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామ నోరా ఫతేహికు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఆమె ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న సందర్భంగా తన అందం, గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నారు.
ఆ షోలో కపిల్ శర్మ నోరాను, మీ స్కిన్ ఇంత గ్లోయింగ్‌గా ఉండటానికి కారణం ఏమిటి, మీరు ఏమి తింటారు, మీ డైలీ రొటీన్ ఏంటి అని ప్రశ్నించారు. దీనికి నోరా నవ్వుతూ స్పందిస్తూ, తాను పాస్తా, అన్నం, పప్పు, రోటీ, ఉడికించిన బంగాళదుంపలు తింటానని తెలిపారు. అలాగే తనకు కారు లేదని, ఆటో రిక్షాలోనే ప్రయాణిస్తానంటూ సరదాగా చెప్పి అందరినీ నవ్వించారు.
స్పెషల్ డ్యాన్స్ నంబర్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నోరా, బాట్లా హౌస్, స్ట్రీట్ డ్యాన్సర్ 3D, మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలతో నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన అనుభవం కూడా ఆమెకు ఉంది.
ప్రస్తుతం నోరా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచన 4లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!