

మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలు నైరాపై ప్రశంసలు కురిపించారు. మన శంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని ‘ఫ్లై.. హై’ పాటను నైరా ఆలపించిన తీరును చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. తన చిన్న మేనకోడలు ఈ పాట పాడటం చూసి హృదయం ఆనందంతో నిండిపోయిందని తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో నైరా తన ప్రతిభతో మరింత ఎత్తుల్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సంక్రాంతి చిత్రం మన శంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!