

టాలీవుడ్ సంక్రాంతి బరిలో నిలిచిన మరో ఆసక్తికరమైన సినిమా అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనున్నారు. కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 14 న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే U/A సర్టిఫికెట్ పొందింది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల అనగనగా ఒక రాజు సినిమా నుంచి మూడో సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ స్పెషల్ సాంగ్‌లో సాన్వి మేఘన ‘ఆంధ్ర టూ తెలంగాణ’ అంటూ సందడి చేసింది. నవీన్ పోలిశెట్టితో కలిసి ఆమె వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!