
.webp&w=3840&q=75)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ రియాలిటీ షోకు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా, ఎలిమినేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్లో ఫైనల్ కు చేరిన టాప్ 5 కంటెస్టెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించారు.
ఈ సీజన్లో డిమోన్ పవన్, ఇమాన్యుయల్, సంజన గల్రానీ, తనుజా, కళ్యాణ్ పడాల టాప్ 5 లో స్థానం దక్కించుకున్నారు. ఇదే వారం రెండు ఎలిమినేషన్లు జరగగా, శనివారం జరిగిన ఎపిసోడ్లో సుమన్ శెట్టి షో నుంచి బయటకు వెళ్లారు. ఆదివారం భరణి ఎలిమినేట్ అయ్యారు.
ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్ పై నిలిచింది. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎవరు అనే విషయం తేలనుంది. డిసెంబర్ 21 న విజేతను ప్రకటించనున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రాథమిక అంచనాల ప్రకారం, తనుజా విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!