
టెక్నాలజీ

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. సినిమా రంగంలోకి రావాలనుకునే మగ పిల్లలైనా, ఆడ పిల్లలైనా ధైర్యంగా ముందుకు రావాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఇండస్ట్రీపై అపోహలు పెట్టుకోకుండా ప్రతిభను నమ్ముకుని ముందుకు వెళ్లాలని అన్నారు.
చిత్ర పరిశ్రమ అద్దంలాంటిదని చిరంజీవి వ్యాఖ్యానించారు. మనం ఎలా ప్రవర్తిస్తామో ఫలితాలు కూడా అలాగే ఉంటాయని తెలిపారు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ వారి వారి వర్కింగ్ స్టైల్ ఉంటుందని, పరిశ్రమలో పరిస్థితులు బాగోలేదని అనడం వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మన వ్యక్తిత్వం, బీహేవియర్ను బట్టి మనకు ఎదురయ్యే అనుభవాలు మారుతాయని ఆయన తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!