
బిజినెస్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK111’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమాను మొదట ముంబై అండర్వర్ల్డ్ గ్యాంగ్‌స్టర్ కథగా ప్రచారం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కాకుండా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ముంబై అండర్వర్ల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో దేశభక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దేశభక్తి నేపథ్య చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే బాలకృష్ణ ఈ చిత్రంలో సింగిల్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!