
గాసిప్స్

‘ది రాజాసాబ్’ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా చివర్లోనే పార్ట్-2 టైటిల్ను వెల్లడించారు. దీనికి ‘రాజాసాబ్ సర్కస్: 1935’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. పార్ట్-2 లో ప్రభాస్ జోకర్ లుక్లో కనిపించనున్నారని చెప్పారు. ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఈ పార్ట్-2 కథ ప్రీక్వెలా లేదా సీక్వెలా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ట్రైలర్లో చూపించిన కొన్ని సన్నివేశాలు, అలాగే ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్కు సంబంధించిన సీన్లు పార్ట్-1లో లేవు. అవన్నీ పార్ట్-2లో ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!