

న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ నుంచి మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో భయంకరమైన లుక్‌లో కనిపించాడు. భారీగా పెరిగిన శరీరం, పొడవాటి జడ జుట్టు, గుబురు గడ్డం, వంకర మీసాలు, ఎరుపు గ్లాస్లు, మెడలో మెటల్ చైన్స్, స్లీవ్‌లెస్ బ్లాక్ డ్రెస్‌తో నాని పూర్తిగా బీస్ట్ మోడ్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ చూస్తేనే పాత్రలో ఉన్న క్రూరత్వం, శక్తి స్పష్టంగా తెలుస్తోంది.
ఈ పోస్టర్లో చూపిన సీన్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీక్వెన్స్ అని సమాచారం. ఈ సన్నివేశంలో నాని విదేశీ ఫైటర్లతో ఒంటరిగా పోరాడుతూ కనిపించనున్నాడు. ‘దసరా’ సినిమాతో తన రా, రియలిస్టిక్ స్టైల్‌ను చూపించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతున్నాడని టాక్. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ‘ది ప్యారడైజ్’ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నాని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!