

సినిమాను ప్రకటించినప్పుడే విడుదల తేదీ వెల్లడించి, ఆ తరువాత వర్క్ పూర్తికాక వాయిదా వేయడం టాలీవుడ్లో ఇటీవల సాధారణంగా మారింది. ఈ జాబితాలో తాజాగా చేరిన చిత్రం ది ప్యారడైజ్. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా మూవీని ఆగస్టు 21కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. గతంలో మార్చి 26 న విడుదల చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషు స్పానిష్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
‘దసరా’ కంటే ఎక్కువ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ చెబుతుండగా, రెండు జడల లుక్‌లో నాని కనిపించడం, మోహన్‌బాబు, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. అదే సమయంలో రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా మార్చి 27 నుంచి ఏప్రిల్ 30 కి వాయిదా పడటం, పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను మార్చి 26 న విడుదల చేస్తామని ప్రకటించడం వల్ల ది ప్యారడైజ్ వాయిదా ఖాయమనే ప్రచారం జరిగింది. తాజా ప్రకటనతో నాని అభిమానుల సందేహాలకు తెరపడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!