
బిజినెస్

క్రిస్టోఫర్ నోలన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక ఆరంభాన్ని నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.2,482.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ప్రచారంలో ఉన్న రూ.2,400 కోట్ల నిర్మాణ వ్యయాన్ని అధిగమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది అత్యంత భారీ హాలీవుడ్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.
మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అద్భుతమైన ప్రారంభ వసూళ్లతో దూసుకుపోతున్న ది ఒడిస్సీ ఇదే జోరు కొనసాగిస్తే క్రిస్టోఫర్ నోలన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!