
గాసిప్స్

చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మన శంకరవరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ‘ఫ్లై.. హై’ అంటూ సాగే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ ‘ఫ్లైయింగ్ హై’ పాటను పాడింది చిరంజీవి మేనకోడలు నైరా అని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. నైరా చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అని తెలిపారు. ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వీడియో పాటను బుధవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!