దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కుతున్న కాంతా సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు వచ్చిన పాటలు, టీజర్ రెండూ కూడా సినిమాపై మంచి ఆసక్తి రేపాయి. ఇప్పుడే కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ అప్డేట్ని ప్రకటించడానికి రిలీజ్ చేసిన ఫస్ట్ స్పార్క్ వీడియోతోనే ప్రేక్షకుల్లో కొత్త కుతూహలం మొదలైంది. రెండు శక్తివంతమైన క్యారెక్టర్ల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా అని టచ్ ఇచ్చారు.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక ఫేమస్ యాక్టర్‌గా, సముద్రకని ఒక ఫిల్మ్‌మేకర్‌గా కనిపించబోతున్నారు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దుల్కర్ సొంత బ్యానర్ వే ఫారర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుండగా, రానా దగ్గుబాటి యొక్క స్పిరిట్ మీడియా ఈ ప్రాజెక్ట్‌ని ప్రెజెంట్ చేస్తోంది. టీజర్‌తో కాంతా ప్రపంచం ఎలా ఉండబోతుందో ఒక చిన్న లుక్ చూపించారు, ఇప్పుడు ట్రైలర్ మాత్రం మరింత డెప్త్‌లోకి తీసుకెళ్లి స్టోరీ ఎమోషన్ని క్లియర్‌గా చూపించబోతుందని అంచనా.


.webp&w=3840&q=75)

.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)












.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
another blockbuster for DQ