
.jpg&w=3840&q=75)
ప్రసిద్ధ జానపద గీతం ‘అనిత ఓ అనిత’ వెనుక ఒక హృదయ విదారక ప్రేమకథ దాగి ఉంది. డిగ్రీ రోజుల్లో అనిత అనే యువతిని ప్రేమించిన గాయకుడు నాగరాజుకు కుల భేదాల కారణంగా వియోగం ఎదురైంది. ఆ బాధను పాట రూపంలో వ్యక్తం చేయగా, అది ప్రేక్షకుల హృదయాలను తాకి సంచలనంగా మారింది. 2008 లో విడుదలైన ఈ పాట ప్రేమ విఫలమైన అనుభవాలను ప్రతిబింబిస్తూ, ముఖ్యంగా నైంటీస్ కిడ్స్ను బలంగా కనెక్ట్ చేసింది. ఈ పాట యూట్యూబ్‌లో 112 మిలియన్ల వ్యూస్‌ను సాధించి, తెలుగు ఫోక్ మ్యూజిక్‌లో ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
ఈ పాట విజయం తర్వాత అనేక అపోహలు, పుకార్లు ప్రచారంలోకి వచ్చాయని నాగరాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాట పాడిన వ్యక్తులు చనిపోయారన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, ఒక వీడియోకు తన పాటను కలపడం వల్లే ఈ గందరగోళం మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ఈ పాట తన కాలేజీ రోజుల్లో రాసినదని, రెండు వైపుల ప్రేమగా మొదలై వియోగంతో ముగిసిన అనుభవమే దీనికి ప్రేరణ అని చెప్పారు. ప్రస్తుతం తాను, అనిత ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నామని, తనకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాట వల్ల ఆమెకు ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!