

ధనుష్ – కృతి సనన్ జంటగా రూపొందిన తేరే ఇష్క్ మేన్ ట్రైలర్ విడుదలైంది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథలు చెప్పడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం, ప్రేమను అంచుల దాకా నడిపే కథను సూచిస్తోంది.
ట్రైలర్లో ధనుష్ కోపంతో, అహంకారంతో నడిచే యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. కృతి సనన్‌తో అతని ప్రేమ ప్రయాణం కళాశాల రోజుల నుంచి మొదలై ఎంజాయ్మెంట్, భావోద్వేగాలతో నిండుగా సాగుతుంది.
కానీ అకస్మాత్తుగా కృతి తన నిర్ణయాన్ని మార్చుకుని మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించడంతో కథ పూర్తిగా మారిపోతుంది.
విరహంతో ఇద్దరి జీవితాలు ఊహించని మార్గాల్లోకి మళ్లుతాయి.
సాధారణంగా విరహంతో హీరోనే కుంగిపోతాడు.
కానీ తేరే ఇష్క్ మేన్ లో ఈ సారి హీరో కాదు… హీరోయిన్నే విరహ వేళలో కుంగిపోతూ చూపించారు — సిగరెట్లు, మద్యం, భావోద్వేగపు పతనం.
అటు ధనుష్ మాత్రం పూర్తిగా మారిపోతాడు — క్రమశిక్షణ, శిక్షణతో కూడిన ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఎదిగిపోతాడు.
ఈ చిత్రానికి:
సంగీతం: ఏ.ఆర్. రెహ్మాన్
కెమెరా: తుషార్ కాంతి రే
ఎడిటింగ్: హేమల్ కోతారి
నిర్మాతలు: ఆనంద్ ఎల్ రాయ్, హిమాంశు శర్మ, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్
రచన: హిమాంశు శర్మ & నిరజ్ యాదవ్
ధనుష్ నటన, రెహ్మాన్ సంగీతం, ఆనంద్ ఎల్ రాయ్ భావోద్వేగాలతో కలిస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి పెరిగింది.
తేరే ఇష్క్ మేన్ సినిమా 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!