
న్యూస్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వినోదాత్మక చిత్రం క్రేజీ కల్యాణం. ఈ సినిమాను యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి తరుణ్ భాస్కర్ పోషించిన బాల్ రాజ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో తరుణ్ భాస్కర్ సూపర్ హీరోలా ఉత్సాహంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
పెళ్లి నేపథ్యంలో సాగే వినోదభరితమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!