

తమిళ స్టార్ హీరో, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి గుడ్‌బై చెప్పే కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘జన నాయగన్’ సినిమానే తన చివరి చిత్రం అని ఆయన అధికారికంగా ప్రకటించారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో విజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లో పూర్తిగా దృష్టి పెట్టాలనే నిర్ణయంతో సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకాగా, ఇది మలేషియా రికార్డ్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది.
ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగంగా మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి ఇసుకతో చిన్న ఇల్లు కట్టాలనే ఆశతో వచ్చానని, కానీ అభిమానులు తనకు రాజమహల్ ఇచ్చారని అన్నారు. ఇన్నాళ్లు తనను ఆదరించిన అభిమానుల కోసం ఇకపై ప్రజాసేవలో మరో 30 ఏళ్లు నిలబడతానని స్పష్టం చేశారు. సినిమాల ద్వారా కాకుండా రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2024 లో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!