

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు–తమిళ ద్విభాషా పీరియడ్ డ్రామా ‘కాంతా’ రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే చెన్నైలో ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించగా, తమిళ మీడియా నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ స్పందన వచ్చింది.
సోషల్ మీడియాలో కూడా అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ ఫిలిం క్రిటిక్ రమేష్ బాలా ఈ చిత్రానికి 4.5/5 రేటింగ్ ఇస్తూ, దుల్కర్ సల్మాన్ ఈసారి నేషనల్ అవార్డ్ గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆయన ఇలా ట్వీట్ చేశారు:
“ఫస్ట్ హాఫ్ అద్భుతమైన డ్రామా, సెకండ్ హాఫ్ బ్రిలియంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. 1950ల మద్రాస్ సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కింది. @dulQuer నటన జాతీయ అవార్డ్ స్థాయిలో ఉంది. #BhagyashriBorse అద్భుతం, @thondankani ఫాంటాస్టిక్, @RanaDaggubati సూపర్బ్. టెక్నికల్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడు #SelvamaniSelvaraj కథ చెప్పడంలో మాస్టర్!”
అలాగే VJ సంతోష్ కూడా చిత్రానికి 4.5 స్టార్ రేటింగ్ ఇస్తూ, దీన్ని “ఇయర్ ఆఫ్ ది క్లాసిక్” అని అభివర్ణించారు.
ఆయన అన్నారు:
“#SelvamaniSelvaraj అద్భుతమైన ఈగో క్లాష్, రొమాన్స్, టెన్షన్ కలయికలో రూపొందించిన కథతో మనసును కదిలిస్తారు. @dulQuer నటన అత్యుత్తమ స్థాయిలో ఉంది. గత సంవత్సరం లక్కీ భాస్కర్, ఈ సంవత్సరం కాంతా — బ్లాక్బస్టర్లలో డార్క్ హార్స్. @RanaDaggubati, #BhagyashriBorse, @thondankani పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తప్పక చూడాల్సిన సినిమా!”
విమర్శకుల ప్రశంసలు మరియు పాజిటివ్ రివ్యూలతో కాంతా రేపటి విడుదలకు ముందు బలమైన బజ్ సృష్టించింది. ఈ రోజు హైదరాబాద్‌లో తెలుగు ప్రీమియర్ జరగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!