

పోలీస్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు అనగానే ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే సిరీస్‌లలో సూర్య నటించిన సింగం చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. తెలుగులో ‘ఘర్షణ’ తర్వాత ఆ స్థాయిలో పోలీస్ పాత్రకు క్రేజ్ తీసుకొచ్చిన హీరోగా సూర్య ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
అయితే సింగం 3 తర్వాత సూర్య మళ్లీ పూర్తిస్థాయి పోలీస్ జానర్ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
సూర్య 47 వ సినిమాను ఇటీవల ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆయన పోలీస్ పాత్రలో నటిస్తున్నారన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మలయాళంలో ఆవేశం సినిమాతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు జిత్తు మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో సూర్యను ఒక బ్యాడ్ పోలీస్ క్యారెక్టర్‌గా చూపించనున్నారని సమాచారం. సాధారణ పోలీస్ పాత్రల కంటే భిన్నంగా, మరింత ఇంటెన్స్‌గా ఈ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ ప్రోమో కట్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆ ప్రోమో షూటింగ్ కూడా జరుగుతోందని, త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ‘సూర్య 47’ అనే వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాతో సూర్య పోలీస్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!