

వైవిధ్యమైన పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్న నటుడు సునీల్ తాజాగా తన సినిమా కాటాలన్ ప్రమోషన్స్‌లో పాల్గొని పుష్ప సినిమాలో చేసిన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్పలో మంగళం శ్రీను పాత్రలో కనిపించిన సునీల్ తన నటనతో ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని సునీల్ తెలిపారు. దర్శకుడు సుకుమార్ ఇచ్చిన మంగళం శ్రీను పాత్ర తన జీవితానికి కొత్త మలుపు తీసుకువచ్చిందని చెప్పారు. పుష్ప విజయంతో ఇతర భాషల దర్శకులు కూడా తనను కొత్త కోణంలో చూడడం ప్రారంభించారని, అదే కారణంగా జైలర్, కాటాలన్ వంటి సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం విభిన్న భాషల నుంచి వైవిధ్యభరితమైన పాత్రలు వస్తుండటంతో నటుడిగా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సునీల్ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!