
.jpeg&w=3840&q=75)
రాజశ్యామల బ్యానర్‌పై హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో, మధు కాలిపు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేంద్రగిరిలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో, సోషియో ఫాంటసీ మరియు సూపర్ న్యాచురల్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
హీరో సుమంత్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం గ్లిమ్స్‌తో పాటు కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సుమంత్ డైనమిక్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో రెండు ముఖ్యమైన పాత్రల్లో ప్రముఖ హీరో, హీరోయిన్ నటిస్తున్నారని, వాటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రంలో సుమంత్‌తో పాటు మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కథను మురళి అందించారు. ఈ సినిమా సుమంత్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఆయన పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!