
జనరల్

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సుధీర్ జోకర్ చిత్రం తాజాగా విడుదలైన బ్యాంగర్తో మంచి హైప్ సొంతం చేసుకుంటోంది. సుధీర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో వరుసగా జరుగుతున్న వింత దొంగతనాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు బ్యాంగర్లో చూపించారు.
దర్శకుడు పీఎస్ సునీల్ పుప్పాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, కామెడీ, సస్పెన్స్ అంశాలను సమతూకంగా మేళవించినట్లు తెలుస్తోంది. సుధీర్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా “ఒక ధనవంతుడు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు?”, “అతని అసలు లక్ష్యం ఎవరు?” అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టైలిష్ విజువల్స్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!