
బిజినెస్

‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి నటిస్తున్న కొత్త చిత్రం హైకూ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ వీడియో ద్వారా ప్రకటించింది. తొలి సినిమా ‘కోర్ట్’ తోనే పెద్ద గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో ‘బ్యాండ్ మేళం’ చిత్రంలో నటిస్తుండగా, తమిళంలో కేజేఆర్ సరసన మరో సినిమా చేయనుంది.
ఇటీవల ఆమె నటిస్తున్న మరో తమిళ చిత్రం హైకూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో నటుడు ఏగన్ హీరోగా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇడుక్కిలో పూర్తి కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్‌ఫుల్ కాలేజ్ లవ్ స్టోరీకి, సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!