

మన మధ్యలో ఒకడిలా కనిపించే పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం విష్ణు విన్యాసంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ సినిమా హాస్యం, భావోద్వేగాలు కలగలిపిన వినోదాత్మక కథగా రూపొందిందన్నారు. జాతకాలు, అంకెలు, గ్రహాలపై మక్కువ కలిగిన వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. వ్యక్తిగతంగా సంప్రదాయాలను గౌరవించినప్పటికీ మూఢనమ్మకాల్ని పూర్తిగా అనుసరించనని ఆయన స్పష్టం చేశారు. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా సినిమా రూపొందిందన్నారు.
సినిమాలో హీరో–హీరోయిన్ పాత్రల మధ్య వచ్చే వినోదాత్మక సంఘటనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని శ్రీవిష్ణు చెప్పారు. కథానాయిక నయన్ సారిక కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. కొత్త దర్శకులతో పని చేయడం తనకు ఇష్టమని, వారితో కొత్త ఆలోచనలు వస్తాయని చెప్పారు. త్వరలో కామ్రేడ్ కళ్యాణ్ సహా పలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే పేరుతో ప్రేక్షకులు తన నుంచి నవ్వులు ఆశిస్తారని, ప్రతి సినిమాలో కొత్త తరహా కామెడీ టైమింగ్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!