

సంక్రాంతి 2026 సీజన్ టాలీవుడ్ కు ఈసారి గట్టి పోటీగా మారనుంది. ఈ బరిలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తిస్థాయి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ కామెడీగా రూపొందింది. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ పూర్తిగా ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను జనవరి 14, 2026 న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రంలో మరో స్పెషల్ ఆకర్షణ ఏమిటంటే… కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంటుగా పేరున్న శ్రీవిష్ణు స్పెషల్ క్యామియో. సినిమాలో ఆయన ఎంట్రీ కీలకమైన మలుపు వద్ద ఉంటుందని, హాస్యం–ఎమోషన్ కలబోసిన సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాల టాక్. శర్వానంద్–శ్రీవిష్ణు కలిసి స్క్రీన్‌ను పంచుకోవడం అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా నిలవనుంది. శ్రీవిష్ణు క్యామియో సీన్ల షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందని సమాచారం.
ఈ సినిమా టైటిల్, నారీ నారీ నడుమ మురారి నుంచి ప్రేరణ పొందినప్పటికీ, కథ మాత్రం పూర్తిగా కొత్తది. ఫన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. శర్వానంద్‌కు ఉన్న సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుతుందా? హ్యాట్రిక్ హిట్ సాధిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సంక్రాంతి బరిలో ఇప్పటికే భారీ సినిమాలు ఉన్నాయి. ది రాజాసాబ్ (జనవరి 9), చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు (జనవరి 12), రవితేజ సినిమా (జనవరి 13), నవీన్ పొలిశెట్టి అనగనగ ఒక రాజు (జనవరి 14) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ గట్టి పోటీలో శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా నిలబడుతుందో చూడాలి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!