

ఒకే హీరో రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం సినీ పరిశ్రమలో ఎప్పుడూ రిస్క్‌గా భావిస్తారు. గతంలో నాని, బాలకృష్ణ లాంటి స్టార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి శ్రీవిష్ణుకు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆయన నటించిన మృత్యుంజయ్, విష్ణు విన్యాసం చిత్రాలు రెండూ ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మృత్యుంజయ్ ఈ నెల 27 న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించగా, విష్ణు విన్యాసం కూడా అదే తేదీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఓటీటీ ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుండటంతో, ఈ నెలలోనే సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఒక వారం గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నా, రెండు నోటెడ్ రిలీజులు దగ్గర దగ్గరగా రావడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి చీలిపోయే ప్రమాదం ఉంది. వేర్వేరు జానర్ల సినిమాలైనా, యూత్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న శ్రీవిష్ణుకు ఇది సవాల్‌గా మారవచ్చు. చివరికి ఇది డబుల్ ఇబ్బందిగా మారుతుందా లేక డబుల్ బొనాంజాగా మారుతుందా అనేది వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!