

నేచురల్ స్టార్ నాని సినీ పరిశ్రమలో నటుడిగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయగా, నాని సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా మేకర్స్ ‘ది ప్యారడైజ్’ నుంచి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. షూటింగ్ సన్నివేశాలతో పాటు పలు సరదా క్షణాలను ఇందులో చూపించారు. ఈ వీడియోలోని ఫన్నీ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ది ప్యారడైజ్’లో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!