

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్‌కి ప్రమోషన్లో భాగంగా రాహుల్ రవీంద్రన్ హాజరయ్యారు. సినిమా పూర్తయ్యాక ఒక యువతి మాట్లాడుతూ — ఈ సినిమా తనకు చాలా నచ్చిందని, మహిళల ధైర్యాన్ని చూపించిన పాయింట్లు చాలా బాగున్నాయని చెప్పింది. చివర్లో చున్నీ తీసేసి “ఇది నా ధైర్యానికి సంకేతం” అని చెప్పిన ఆమెను దర్శకుడు హగ్ చేసుకున్నారు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. కొందరు “ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చున్నీ తీసేయడం కాదు” అని విమర్శించగా, ఇంకొందరు “ఇది ధైర్యానికి ఒక ప్రతీక మాత్రమే” అని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో విషయం చిన్న వివాదంగా మారింది. దాంతో నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. “గత వారం విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందుకే మా టీమ్ థియేటర్లను సందర్శిస్తోంది. సినిమాలో చెప్పాలనుకున్నది ఒక్కటే — భయాన్ని పోగొట్టమని. చున్నీ తీసేయమని కాదు,” అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
“ఆ సీన్ ఉద్దేశం మహిళలు తమలోని భయాన్ని తొలగించుకోవడం గురించిదే. దయచేసి దాన్ని వేరే కోణంలో చూడవద్దు,” అంటూ ఎస్కేఎన్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ ‘చున్నీ వివాదం’పై తాత్కాలికంగా క్లారిటీ వచ్చినట్లే చెప్పాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!