

మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. అదే సమయంలో సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, ఇండస్ట్రీ అద్దం లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
చిరంజీవి వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. కాస్టింగ్ కౌచ్ లేదన్న మాటలను ఆమె ఖండించారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆమె సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్స్ చేస్తూ తన అనుభవాలు, ఉదాహరణలు వెల్లడించారు.
కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని పెద్ద సమస్య అని చిన్మయి అన్నారు. కమిట్మెంట్కు నో చెబితే అవకాశాలు ఇవ్వరని, పని ఇచ్చినందుకు బదులుగా శారీరక డిమాండ్లు చేసే వారు ఉన్నారని చెప్పారు. లిరిక్ రైటర్ వైరముత్తు తనను వేధించాడని, అతని తల్లి పక్కనే ఉన్నా కూడా ప్రవర్తన మారలేదని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణే అసలు సమస్య అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!