

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ అప్డేట్స్ కోసం ఎదురుచూసిన సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదలై సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. అయితే అదే సమయంలో ‘దేవర 2’తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ‘దేవర 2’పై కనీసం పోస్టర్, షూటింగ్ అప్డేట్ కూడా లేకపోవడంతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటంతో ‘దేవర 2’ ఆలస్యమవుతోందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు త్రివిక్రమ్‌తో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని, దానికి సంబంధించిన ప్రకటన జూన్‌లో వచ్చే అవకాశముందని సమాచారం. ‘డ్రాగన్’ గ్లింప్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపినా, ‘దేవర 2’పై కొనసాగుతున్న నిశ్శబ్దం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!