

పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ప్రత్యేకమైన కథాంశాలతో పేరు తెచ్చుకున్న పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు స్వప్న సినిమా సమర్పణలో, సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తిని గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మరో ఆసక్తికరమైన అప్డేట్ను విడుదల చేసింది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కళ్లకు అద్దాలు ధరించి, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో శృతి హాసన్ కనిపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. పెదవుల పై ఉన్న సిగరెట్, దాని నుంచి వెలువడుతున్న పొగ ఆమె పాత్రకు రఫ్, గ్రిటీ స్వభావాన్ని సూచిస్తోంది. కథలో ఆమె పాత్ర కీలక మలుపుగా నిలవనుందని చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలతో రూపొందుతోంది. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సుజిత్ సారంగ్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను శ్వేతా సాబు సిరిల్ పర్యవేక్షిస్తున్నారు.
నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!