

‘ప్రేమలు’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు గిరీష్ ఏడీ, ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమలు 2’ తెరకెక్కించాలని భావించారు. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది. అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. తాజాగా తన దర్శకత్వంలో మమిత బైజు నటించిన ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో గిరీష్ ఏడీ ఈ విషయంపై స్పందించారు. ‘ప్రేమలు 2’ కోసం ఏడాది పాటు పనిచేసిన తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోవడం తమకు పెద్ద ఎదురుదెబ్బగా మారిందని ఆయన వెల్లడించారు.
‘ప్రేమలు’ విడుదలై భారీ విజయం సాధించకముందే ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ సినిమా తీయాలని అనుకున్నట్లు గిరీష్ తెలిపారు. అయితే, ‘ప్రేమలు’ సూపర్‌హిట్ కావడంతో సీక్వెల్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘ప్రేమలు 2’ గత ఏడాది విషు పండుగ సందర్భంగా విడుదలయ్యేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడంతోనే ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ ఆలోచన వచ్చిందని వెల్లడించారు. తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, ఇది ఇంతటి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని ఊహించలేదని గిరీష్ ఏడీ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!