
క్రీడలు

బాలీవుడ్ నటి శర్వారీ వాఘ్ త్వరలో విడుదల కానున్న మా వాపస్ ఆవుంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే సమయంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఆల్ఫా సినిమాలో అలియా భట్‌తో కలిసి నటిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో శర్వారీ మాట్లాడుతూ ఆల్ఫా సినిమా షూటింగ్ సమయంలో అలియా భట్ తనకు మంచి స్నేహితురాలిగా మారిందని చెప్పారు. ప్రిపరేషన్ నుంచి షూటింగ్ వరకు ఇద్దరం కలిసి ప్రయాణించామని తెలిపారు. అలియా భట్‌కు తాను ఎప్పటినుంచో అభిమానినని, కానీ ఆమెను సులభంగా సంప్రదించగలనని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. సెట్లో ఆమె అందరినీ ఒకటిగా కలిపే స్వభావం తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. అలియా నటనను దగ్గరగా చూడటం, ఆమె పని విధానాన్ని అర్థం చేసుకోవడం అద్భుతమైన అనుభవమని, ఈ ప్రయాణంతో ఆమెపై తన అభిమానం మరింత పెరిగిందని శర్వారీ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!