
జనరల్

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ‘కాక్టెయిల్ 2’ చిత్రంలో కునాల్ అనే ప్రియుడి పాత్రలో కనిపిస్తూ తన ప్రేయసి కోసం భావోద్వేగంగా పాటలు పాడుతున్నాడు. ఈ చిత్రంలో కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా, దర్శకుడు హోమి అడజానియా తెరకెక్కించారు. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ‘మషూక్’ అనే కొత్త పాటను తాజాగా విడుదల చేశారు.
ఈ పాట మొదట షాహిద్ కపూర్, కృతి సనన్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీతో సాగుతూ ప్రేమ గీతంలా కనిపిస్తుంది. అయితే చివర్లో రష్మిక మందన్న ఎంట్రీతో స్నేహం, భావోద్వేగం కలగలసిన కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!