

చిన్న స్థాయి నుంచి ఎదిగి మంచి నటుడిగా గుర్తింపు పొందిన సత్యదేవ్, ప్రస్తుతం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన రావు బహదూర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం జూలై 3న విడుదల కానుండగా, విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సత్యదేవ్ వరుస ఇంటర్వ్యూలతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో సత్యదేవ్ తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం బ్లఫ్ మాస్టర్ గురించి మాట్లాడుతూ, “షూటింగ్ సమయంలోనూ, విడుదలకు ముందూ ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని భావించాం. కానీ విడుదల తర్వాత ఆశించిన ఫలితం రాకపోవడం నాకు నిరాశ కలిగించింది” అని చెప్పారు. అలాగే, ఆ సినిమాకు అప్పట్లో సరైన గుర్తింపు లభించి ఉంటే తన కెరీర్ మరింత మెరుగ్గా ఉండేదని భావించినప్పటికీ, జీవితంలో ఇలాంటి పరిణామాలు సహజమేనని ఇప్పుడు అర్థమైందని తెలిపారు. ప్రస్తుతం రావు బహదూర్పై మంచి అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!