

రాబోయే వినోదాత్మక చిత్రం ‘సతీ లీలావతి’ వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించారు. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, సినిమా ప్రారంభ సమయంలో తాను గర్భవతినని, దర్శకుడు మరియు నిర్మాతల సహకారంతో కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయగలిగానని తెలిపారు. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ, కమల్ హాసన్ నటించిన పాత ‘సతీ లీలావతి’తో తమ చిత్రాన్ని పోల్చవద్దని, అందరూ రిలేట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. నిర్మాత నాగ మోహన్ ఇది తన తొలి చిత్రం అని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 6 న విడుదల చేయనున్నామని తెలిపారు. నటుడు సప్తగిరి కూడా ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని అన్నారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్‌తో పాటు నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!