

తమిళ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక మోహనన్ తాజాగా తన యాక్షన్ షూటింగ్ అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో జరిగిన ఇంటరాక్షన్‌లో సినిమా కోసం తాను చేసిన ఓ రిస్కీ స్టంట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
షూటింగ్ సమయంలో సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సాయంతో కిందకు దూకే స్టంట్ చేసినట్లు మాళవిక తెలిపింది. గాలిలో పడిపోతున్న విమానం నుంచి కిందకు దూకుతున్నట్లుగా ఈ యాక్షన్ సీన్‌ను డిజైన్ చేశారట. సన్నివేశం మరింత సహజంగా కనిపించేందుకు తన చుట్టూ భారీ బ్లోయర్లను ఏర్పాటు చేసి విపరీతమైన గాలిని సృష్టించినట్లు ఆమె పేర్కొంది.
అంత ఎత్తులో స్టంట్ చేయడం మాత్రమే కాకుండా భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ కేకలు వేయకుండా బాడీ పోశ్చర్‌ను మేనేజ్ చేయడం, అదే సమయంలో డైలాగులు చెప్పడం చాలా సవాలుగా అనిపించిందని మాళవిక తెలిపింది. ఆమె వెల్లడించిన ఈ విషయాలతో ‘సర్దార్ 2’లో ఈ యాక్షన్ సీన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మాళవిక మోహనన్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!