

కంటెంట్ ఆధారిత సినిమాలతో యువతరం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఐదు రోజుల్లోనే రూ.100.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 100 కోట్ల క్లబ్లో చేరింది. ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించగా, యూఎస్‌లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి నవీన్ పోలిశెట్టి వరుసగా మూడు సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్‌లోకి తీసుకెళ్లిన అరుదైన యంగ్ హీరోగా రికార్డు సృష్టించారు.
హీరో కటౌట్ లేదా మార్కెట్ హంగులకంటే కథ, పాత్ర బలానికే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంటూ వచ్చిన నవీన్ పోలిశెట్టి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘జాతి రత్నాలు’తో కామెడీ స్టార్‌గా మారిన ఆయన, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా, తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ తో పెద్ద హీరోల సినిమాల మధ్యలోనూ కంటెంట్ ఉంటే బాక్సాఫీస్‌ను శాసించవచ్చని మరోసారి నిరూపించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!