
రాజకీయాలు

తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖుడైన విజయ్ కుమారుడు సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ చిత్రం మొదటి నుంచే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోగా కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలని నిర్ణయించిన సంజయ్ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. తాజాగా విడుదలైన తొలి గీతం ‘సిగ్మా స్టైల్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ యువతను ఆకట్టుకుంటోంది.
తమన్ అందించిన మాస్ బీట్లు, ర్యాప్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కలయిక పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందీప్ కిషన్ స్టైలిష్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు హైలైట్‌గా మారగా, ఫరియా అబ్దుల్లా గ్లామర్ అదనపు బలాన్ని ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై చివర్లో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!