

వచ్చే వారం ఆంధ్రకింగ్ తాలూకా విడుదలవుతోంది. గురువారం రిలీజ్ కావడంతో లాంగ్ వీకెండ్ బెనిఫిట్ దక్కనుంది. అఖండ 2 కూడా రాబోతుండటంతో మైత్రి మూవీ మేకర్స్ మంచి ఓపెనింగ్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్ రేట్లు కూడా 30 కోట్ల లోపే ఉండటం బ్రేక్ ఈవెన్ సులభం చేస్తుంది. హిట్ టాక్ వస్తే మొదటి వారం లోనే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రామ్ కు గత సినిమాలు పని చేయకపోయినా ఆంధ్రకింగ్ తాలూకాకు మంచి వైబ్ ఉంది. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు బాగానే హైప్ క్రియేట్ చేస్తున్నాయి. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కూడా అదనపు బలంగా మారుతోంది.
ఇతర రిలీజ్లు నీరసంగా ఉండటంతో, రాజు వెడ్స్ రాంబాయి నెమ్మదించిన తర్వాత ఆంధ్రకింగ్ తాలూకా కు ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఇద్దరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టార్స్–ఫ్యాన్స్ ఎమోషనల్ కనెక్ట్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. ఈ సినిమా ఫలితంపై రామ్ తదుపరి ప్రాజెక్ట్ నిర్ణయం ఆధారపడి ఉండొచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!