
సినిమాలు

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం ఈ నెల 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది.
తాజాగా మూడో పాట ‘సోల్ ఆఫ్ లెనిన్’ను ఈరోజు సాయంత్రం 4:06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అఖిల్–భాగ్యశ్రీ ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వరుస అపజయాల తర్వాత అఖిల్ ఈ సినిమాతో బలమైన కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున, నాగ వంశీ కలిసి నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!