

మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా టాలీవుడ్లో యాక్షన్-కామెడీ జెట్లీ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడు రితేష్ రానా, నటుడు సత్య కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రంలో రియా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. విమానంలో జరిగే పేలుళ్ల మధ్య, చేతిలో తుపాకీతో, హై పోనీటెయిల్, బ్లాక్ ట్యాంక్ టాప్, మరూన్ ప్యాంట్‌తో రియా శక్తివంతమైన యాక్షన్ అవతారంలో అదరగొట్టారు. ఆమె లుక్ ధైర్యంగా, స్టైలిష్‌గా, పూర్తిగా కమాండింగ్‌గా కనిపించింది.
వైల్డ్ స్టంట్స్, అద్భుత ట్విస్టులు,రితేష్ రానా స్పెషల్ క్విర్కీ హ్యూమర్‌తో నిండిన ఈ చిత్రం పక్కా యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా రానుంది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మత్తు వదలరా టెక్నికల్ టీమ్ — కాల భైరవ (మ్యూజిక్), సురేష్ సరంగం (సినిమాటోగ్రఫీ), కార్తీక శ్రీనివాస్ (ఎడిటింగ్) — మళ్లీ ఒకే బృందంగా పనిచేస్తోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న జెట్లీ ప్రేక్షకులను ఓ వెరైటీ, పిచ్చి ప్రయాణంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!