
జనరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై హైప్ కొనసాగుతుండగా, ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. మే 20న విడుదల కానున్న ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంగీత దర్శకుడు రవి బసృర్ స్టూడియోలో సౌండ్ డిజైనింగ్ పనులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ‘KGF’, ‘సలార్’ వంటి చిత్రాలతో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్న రవి బసృర్, ఈసారి ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి సౌండ్ అనుభూతి ఇవ్వబోతున్నాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!