

వరుస సినిమాలతో పాటు తరచూ ప్రేక్షకులతో మమేకమవుతూ దగ్గరగా ఉండే నటి రష్మిక మందన్న తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 2016 నుంచి ఇప్పటివరకు ఎలాంటి భాషా పరిమితులు పెట్టుకోకుండా భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నానని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతానని రష్మిక తెలిపారు. హీరోయిన్గా ప్రేక్షకులను వినోదపరచడమే తన ప్రధాన బాధ్యత అని, అందుకే కమర్షియల్, లవ్ స్టోరీలు, స్త్రీ ప్రాధాన్యం ఉన్న కథలు అన్నింటినీ అంగీకరిస్తున్నానని ఆమె చెప్పారు.
తనపై వచ్చే రూమర్స్, నెగెటివిటీపై స్పందించిన రష్మిక, వ్యూస్ కోసం కొందరు కావాలనే తప్పుడు వార్తలు రాస్తారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అవి తనను బాధపెట్టినా, ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని చెప్పారు. ఇండస్ట్రీలో నెగెటివిటీ సహజమేనని, ఎప్పటికైనా నిజం ప్రజలకు తెలుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అలాగే తాను ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి అనే ప్రచారాన్ని అపోహగా కొట్టిపారేశారు. అవసరమైతే స్పెషల్ సాంగ్స్ చేయడానికి సిద్ధమేనని, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అవి చేస్తానని రష్మిక స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!