
టెక్నాలజీ

రణవీర్ సింగ్ పై వచ్చిన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ వివాదంపై ఆయన టీమ్ స్పందించింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలో, తాము సినీ పరిశ్రమను ఎంతో గౌరవిస్తామని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ అంశాలను హుందాగా, పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని తెలిపారు.
డాన్ 3కి సంబంధించిన వివాదం, రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో భారీ నష్టాలు వాటిల్లాయన్న వార్తల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆరోపణలపై పూర్తిస్థాయిలో స్పందించకుండా, పరిశ్రమతో తమ అనుబంధాన్ని గౌరవిస్తామని మాత్రమే రణవీర్ టీమ్ స్పష్టం చేసింది. ఈ వివాదం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!