

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ గ్లింప్స్ 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
టైటిల్ గ్లింప్స్‌లో యోధుడిగా విజయ్ దేవరకొండ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 19 వ శతాబ్దం నేపథ్యంలో, బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ కథనం, మేకింగ్, భారీ ప్రొడక్షన్ విలువలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ స్పందన సినిమా విజయంలో తొలి అడుగుగా మూవీ టీమ్ భావిస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!