

నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ తొలుత ఉత్తర భారతదేశంలో ప్రారంభమయ్యాయి. అయితే, దక్షిణ భారతదేశంలోని మార్కెట్లలో టికెట్ల విక్రయాలు అందుబాటులోకి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఈ భారీ చిత్రానికి టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందని కొందరు భావించారు. అయితే, తాజాగా నైజాం ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 3డీ ఛార్జీలతో కలిపి ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకే విక్రయాలు జరుగుతుండటంతో ధరల పెంపు ఉంటుందన్న అంచనాలకు ప్రస్తుతానికి తెరపడింది.
ప్రసాద్స్ మల్టీప్లెక్స్, అల్లు సినిమాస్, ఏఎంబీ సినిమాస్‌లో ‘రామాయణ’ తెలుగు, హిందీ వెర్షన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సాధారణ టికెట్ ధరలకే ఈ రెండు వెర్షన్ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని థియేటర్లలోనూ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం 3డీలోనూ విడుదల కానుండటంతో ఆ షోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, తెలుగు, హిందీ వెర్షన్లకు థియేటర్లలో ఎన్ని స్క్రీన్లు కేటాయిస్తారు? ఏ వెర్షన్‌కు ఎక్కువ షోలు లభిస్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!