

రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ ముప్పై తేదీన థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్ విడుదల తేదీని ప్రకటించిన వెంటనే పెద్ది కొత్త తేదీని ప్రకటించడం విశేషంగా మారింది. ఉస్తాద్ భగత్‌సింగ్ మార్చి ఇరవై ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే నెల వ్యవధిలో బాబాయ్, అబ్బాయి సినిమాలు విడుదలకావడంతో అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో స్పందనలు తెలుపుతున్నారు.
గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ క్రికెట్ ఆడే సన్నివేశం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!